: టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పుతో కొట్టారు: ప్రైవేట్ టీచర్ ఫిర్యాదు, కేసు నమోదు
విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత (టీడీపీ)పై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనను చెప్పుతో కొట్టారని ప్రైవేట్ టీచర్ రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే అనితతో పాటు ఆమె వ్యక్తిగత కార్యదర్శి ప్రసాద్, ఎంపీటీసీ విశ్వనాథ్ లపై కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేస్తే సరిపోదని, ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాల్సిందేనని రామారావు తరఫు బంధువులు పాయకరావుపేట పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.