: సిడ్నీలో భారత కాన్సులేట్ సిబ్బంది తరలింపు


ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఓ కేఫ్ లో కొందరు సాయుధులు సామాన్య పౌరులను బందీలుగా పట్టుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్విగ్నత నెలకొంది. ఈ నేపథ్యంలో, కేఫ్ కు సమీపంలోని భారత కాన్సులేట్ ను ఖాళీ చేయించారు. సిబ్బంది సురక్షితంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఘటన స్థలం కాన్సులేట్ కు దగ్గరగా ఉండడంతో, ముందు జాగ్రత్త చర్యగా సిబ్బందిని తరలించామని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ వివరించారు. భారత కాన్సులేట్ స్థానిక అధికార వర్గాలతో సంప్రదింపులు కొనసాగిస్తోందని చెప్పారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సిడ్నీ హైకమిషనర్ తో మాట్లాడారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News