: జీఎస్ఎల్వీ మార్క్-3 రిహార్సల్స్ ప్రారంభం
అంతరిక్షంలోకి మానవులను పంపే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగాత్మకంగా జీఎస్ఎల్వీ మార్క్-3ని నింగిలోకి పంపనుంది. ప్రయోగానికి సంబంధించి ఈ ఉదయం షార్ కేంద్రంలో రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. 17వ తేదీ వరకు రిహార్సల్స్ కొనసాగుతాయి. అనంతరం కౌంట్ డౌన్ ప్రారంభమవుతుంది. 18వ తేదీన జీఎస్ఎల్వీ మార్క్-3ని నింగిలోకి పంపనున్నారు. రిహార్సల్స్ కార్యక్రమానికి ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ హాజరయ్యారు.