: ఐశ్వర్యారాయ్ కు 'మిస్ వరల్డ్ 2014' వేదికపై సన్మానం


మాజీ ప్రపంచ సుందరి, ప్రముఖ కథానాయిక ఐశ్వర్యారాయ్ బచ్చన్ ను 'మిస్ వరల్డ్ 2014' వేదికపై ప్రత్యేక అవార్డుతో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సత్కరించింది. 1994లో ప్రపంచ సుందరిగా ఎంపికయిన నాటి నుంచి ఆమె చేసిన సేవా కార్యక్రమాలకుగాను ఈ అవార్డు అందజేశారు. లండన్ లోని ఎక్సెల్ ప్రదర్శన కేంద్రంలో జరిగిన మిస్ వరల్డ్ కార్యక్రమంలో, భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య, తల్లి వృందా రాయ్ తో ఐశ్వర్య వేదికపై కనిపించింది. ఈ గౌరవం పొందినందుకు చాలా ఆనందంగా ఉందన్న ఐష్ , మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.

  • Loading...

More Telugu News