: అర్ధరాత్రి వరకు రికార్డింగ్ పనుల్లో బిజీగా గడిపిన చక్రి


తెలుగు సినీ పరిశ్రమలో సంగీత 'చక్రం' ఆగిపోయింది. యావత్ సినీ పరిశ్రమను, సినీ అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో కన్నుమూశారు. అనతి కాలంలోనే అగ్రశ్రేణి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన చక్రికి వృత్తి పట్ల అంకిత భావం ఎక్కువ. ఎప్పుడు చూసినా తన పనుల్లో బిజీగానే ఉండేవారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు ఆదివారం అర్ధరాత్రి దాకా ఆయన రికార్డింగ్ థియేటర్ లోనే గడిపారు. అర్ధరాత్రి దాటాక పని ముగించుకుని.... జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ఇంటికి తిరిగొచ్చి నిద్రపోయారు. నిద్రలోనే గుండెపోటుకు గురయ్యారు.

  • Loading...

More Telugu News