: తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ కన్నుమూత
తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. కొంతకాలం క్రితం తిరుపతిలోని తన స్వగృహం వద్ద గుండెపోటు కారణంగా ఆయన కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పరీక్షించిన తిరుపతి స్విమ్స్ వైద్యులు, ఆయనకు రెండు కిడ్నీలు కూడా పనిచేయడం లేదని తేల్చారు. మెరుగైన చికిత్స కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లిన ఆయన చికిత్స పొందుతూనే నేడు తుది శ్వాస విడిచారు. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెంకటరమణ రాష్ట్ర విభజన అనంతరం టీడీపీలో చేరారు. తిరుపతి ఎమ్మెల్యే టికెట్ కోసం చాలా మంది తీవ్రంగా యత్నించినా, తనదైన చతురతతో అందరినీ వెనక్కు నెట్టిన వెంకటరమణ టికెట్ దక్కించుకోవడమే కాక సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిపై విజయం సాధించారు.