: టాలీవుడ్ ను విషాదంలో ముంచెత్తిన చక్రి మరణం... 'మా' సంతాపం


తన సంగీతంతో తెలుగు సినీ పరిశ్రమను, అభిమానులను ఉర్రూతలూపిన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి మరణ వార్తతో టాలీవుడ్ లో విషాదం అలముకుంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు చక్రి మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. చక్రి తుదిశ్వాస విడిచిన అపోలో ఆసుపత్రికి ఒక్కొక్కరుగా వస్తూ ఆయన భౌతికకాయానికి నివాళి అర్పిస్తున్నారు. చక్రి మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సంతాపం ప్రకటించింది. తెలుగు సినీ కళామతల్లికి అంతులేని సేవ చేసిన చక్రి గౌరవార్థం... ఆయన భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్ వద్ద కాసేపు ఉంచబోతున్నారు.

  • Loading...

More Telugu News