: నేడు ప్రకాశం జిల్లాలో ఏపీ సీఎం పర్యటన
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కొండెపిలో జరగనున్న రైతు సాధికారత సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా ఆయన రుణమాఫీకి సంబంధించిన పత్రాలను రైతులకు అందజేయనున్నారు. రైతు రుణమాఫీపై విధాన ప్రకటన చేసిన చంద్రబాబు ఈ నెల 11న తన సొంత జిల్లా చిత్తూరులో రుణమాఫీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయా జిల్లాల్లో నిర్వహిస్తున్న రైతు సాధికారత సదస్సుల్లో పాల్గొంటున్న ఆయన రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన నేడు కొండెపిలో జరగనున్న సదస్సులోనూ రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేస్తారు.