: సిడ్నీ ఉదంతం కలచివేస్తోంది... మానవత్వానికే మచ్చ: మోదీ


ఆస్ట్రేలియా నగరం సిడ్నీలోని ఓ కేఫ్ లో డజనుకు పైగా సాధారణ ప్రజలను ఓ దుండగుడు బంధించడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఆయుధాలు ధరించిన ఓ వ్యక్తి వీరందరినీ బంధించాడని సిడ్నీ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విద్రోహ శక్తుల చేతిలో సామాన్యులు ప్రాణాపాయ స్థితిలో ఉండటం కలచి వేస్తోందని ట్వీట్ చేశారు. ఈ ఘటన మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉందని అన్నారు. బంధీలుగా ఉన్న ప్రతి ఒక్కరూ క్షేమంగా బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.

  • Loading...

More Telugu News