: దెబ్బకు దెబ్బ తీస్తాం: బెంగళూరు పోలీసులకు ఐఎస్ తీవ్రవాదుల బెదిరింపులు


‘షమి విట్ నెస్’ పేరిట ఐఎస్ ఉగ్రవాదులకు ట్విట్టర్ లో చేదోడువాదోడుగా నిలిచిన మెహది మసూద్ బిశ్వాస్ ను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులకు బెదిరింపులు వస్తున్నాయి. తమ సోదరుడిని అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులపై ప్రతీకారం తీర్చుకుని తీరతామని ఐఎస్ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఐఎస్ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చిన మాట వాస్తవమేనని, మెహది అరెస్టులో కీలక భూమిక పోషించిన బెంగళూరు డీసీపీ అభిషేక్ గోయల్ చెప్పారు. అయితే ఐఎస్ ఉగ్రవాదుల హెచ్చరికలకు తామేమీ బెదిరిపోవడం లేదని ఆయన ఘాటుగా స్పందించారు. "మా సోదరుడిని (మహది) మీ చేతుల్లో విడిచిపెట్టం. ప్రతీకారం తీర్చుకుంటాం. వేచి చూడండి (వియ్ విల్ నాట్ లీవ్ అవర్ బ్రదర్ ఇన్ యువర్ హ్యాండ్. రివెంజ్ ఈజ్ కమింగ్. వెయిట్ ఫర్ అవర్ రియాక్షన్)" అంటూ ఐఎస్ ఉగ్రవాదులు గోయల్ ట్విట్టర్ అకౌంట్ కు సందేశాలను పంపారు. సదరు ట్వీట్ ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపై దర్యాప్తు చేస్తున్నామని గోయల్ చెప్పారు.

  • Loading...

More Telugu News