: చాంపియన్స్ హాకీలో జర్మనీ చేతిలో పాక్ చిత్తు
భారత్ పై సెమీ ఫైనల్ లో విజయం సాధించి జబ్బలు చరుచుకున్న పాకిస్థాన్ హాకీ జట్టును జర్మనీ చిత్తుగా ఓడించింది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జర్మనీ, పాక్ జట్టును అలవోకగా మట్టికరిపించింది. మొత్తం ఆటలో రెండు గోల్స్ చేసిన జర్మనీ, గోల్ చేసేందుకు పాకిస్థానీ ఆటగాళ్లకు అసలు అవకాశమే ఇవ్వలేదు. సెమీ ఫైనల్ లో భారత్ పై 4-3 స్కోరుతో విజయం సాధించిన సందర్భంగా పాక్ ఆటగాళ్లు చేసిన వికృత చేష్టల నేపథ్యంలో ఇద్దరిపై అంతర్జాతీయ హాకీ సంఘం చర్యలు తీసుకుంది. ఈ షాక్ నుంచి తేరుకోకముందే, ఇనుమడించిన ఉత్సాహంతో కప్ గెలుస్తామని మైదానంలోకి దిగిన పాక్ బొక్కబోర్లా పడింది.