: మరోసారి ఆ తప్పు చేయను: అమితాబ్
బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ తన రాజకీయ జీవితంపై మాట్లాడారు. అప్పట్లో రాజకీయాల్లో ప్రవేశించడం తప్పేనని, ఆ తప్పును పునరావృతం చేయబోనని అన్నారు. కొన్ని భావోద్వేగాల ఫలితంగానే రాజకీయ రంగప్రవేశం చేశానని, ఆ తర్వాత రాజకీయ సమరాంగణం వాస్తవికతకు భిన్నంగా ఉందన్న విషయాన్ని గుర్తించానని వివరించారు. అప్పటి నుంచి రాజకీయాల్లోకి తిరిగి వెళ్లే ఆలోచనే రాలేదన్నారు. అమితాబ్ 1984 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అలహాబాద్ స్థానం నుంచి గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. పలు కారణాలతో మూడేళ్ల తర్వాత రాజీనామా చేశారు.