: ఖతార్లో క్రికెట్ ఆడుతూ భారతీయుడి మృతి
కేరళకు చెందిన ప్రమోద్ తెరయిల్ (32) అనే వ్యక్తి ఖతార్లో క్రికెట్ ఆడుతూ ప్రాణాలు విడిచాడు. ప్రమోద్ ఉపాధి నిమిత్తం ఖతార్ వెళ్లాడు. అక్కడ ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. శనివారం అతని పెళ్లిరోజు. ఆ రోజు మిత్రులతో కలిసి ఓ పాఠశాల మైదానంలో సరదాగా క్రికెట్ ఆడుతుండగా, ఛాతీలో నొప్పి వచ్చింది. మిత్రులకు విషయం చెప్పాడు. వారు ప్రమోద్ ను ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ ఏడాది ఆరంభంలో అతడికి ఓ బిడ్డ పుట్టగా, చూసేందుకు ఇటీవలే భారత్ వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం అతడి మృతదేహాన్ని భారత్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.