: అతి చేసిన పాక్ హాకీ ఆటగాళ్లు మూల్యం చెల్లించారు!
చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్ తో సెమీఫైనల్ నెగ్గిన అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లు చొక్కాలు విప్పి మైదానంలో విపరీత చర్యలకు దిగారు. దీనిపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన ప్రపంచ హాకీ సంఘం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఫైనల్ ఆడకుండా ఇద్దరు పాక్ ఆటగాళ్లపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో ఆటగాడిని తీవ్రంగా మందలించింది. అటు, హాకీ ఇండియా ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. భవిష్యత్తులో పాక్ తో సిరీస్ లను రద్దు చేసుకునే దిశగా యోచిస్తోంది. అటు, ఆటగాళ్ల ప్రవర్తనకు పాక్ కోచ్ క్షమాపణలు చెప్పినా, భారత జట్టు మేనేజ్ మెంట్ మాత్రం ఆటగాళ్లంతా క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేసింది.