: బావమరిది హరికృష్ణకు చంద్రబాబు పరామర్శ
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తనయుడిని కోల్పోయిన నందమూరి హరికృష్ణను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. హైదరాబాదులో ఈ మధ్యాహ్నం హరికృష్ణ నివాసానికి వెళ్లిన బాబు దాదాపు గంటసేపు అక్కడే ఉన్నారు. ధైర్యంగా ఉండాలంటూ బావమరిదికి సూచించారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతూ రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం తెలిసిందే.