: పోలీసులకు రూ.40 లక్షల లంచమిచ్చి తప్పించుకున్న ప్రశ్నాపత్రాల లీకు వీరుడు


ఆ ఖైదీ రెండు హత్య కేసుల్లో నిందితుడు. ప్రశ్నపత్రాలను లీక్ చేసిన కేసు కూడా అతనిపై ఉంది. ప్రస్తుతం యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నాడు. ఒకసారి జైలు ఊచలు కోసి తప్పించుకోబోయాడు. ఈసారి అంత రిస్క్ ఎందుకులే అనుకున్నాడో ఏమో, ఏకంగా కాపలాగా ఉన్న పోలీసులకు రూ.40 లక్షలు లంచమిచ్చి పారిపోయాడు. అంతేకాదు, తన భార్యతో విదేశాలకు చెక్కేశాడని తెలుస్తోంది. కడలూరు జిల్లా బన్‌ రుట్టీ తాలూకాకు చెందిన తవమణి (30) తిరుచ్చి సెంట్రల్ జైలులో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్నాడు. పూణేలో విచారణలో ఉన్న కేసు విషయమై అక్కడి కోర్టులో హాజరుపరచేందుకు తీసుకువెళుతుండగా, గత నెల 24న తవమణి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో కాపలాగా ఉన్న ఎస్ఐ ఇళంగోవన్ తో పాటు మరో ఐదుగురు పోలీసులు సస్పెండయ్యారు. తప్పించుకున్న తవమణి కోసం గాలింపు జరుపుతుండగా పట్టుబడ్డ ఆయన అనుచరులు ప్రకాష్, మణికంఠన్ లు చెప్పిన వివరాల ప్రకారం తిరుచ్చి పోలీసులు రూ.40 లక్షలు లంచం తీసుకుని తవమణిని విడిచిపెట్టారని, తవమణి భార్యతో సహా విదేశాలకు వెళ్లిపోయాడని చెప్పారు. దీంతో పోలీసులు మరో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News