: మాదక ద్రవ్యాలను వీడితే మన యువతకు తిరుగులేదు: మోదీ


దేశాభివృద్ధికి ఎంతో కీలకమైన యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేటి ఉదయం 11 గంటలకు ఆకాశవాణి మాధ్యమంగా 'మన్ కి బాత్'లో ఆయన ప్రసంగించారు. యువతపై మాదక ద్రవ్యాల ప్రభావం తనకు చాలా ఆందోళన కలిగిస్తోందని అన్నారు. మాదక ద్రవ్యాలను వీడితే భారత యువతకు తిరుగులేదని వివరించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. వీటిని సేవించే వారిని మానసిక రుగ్మతలున్న రోగులుగా భావించి, వారు బయటపడేందుకు కృషి చేయాలని మోదీ అన్నారు.

  • Loading...

More Telugu News