: మరి కాసేపట్లో సినీతారల క్రికెట్... ముస్తాబైన విజయవాడ స్టేడియం
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, శ్రీమిత్ర టౌన్ షిప్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సినీ తారల క్రికెట్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందుకోసం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. ఇప్పటికే వేలాదిమంది అభిమానులు స్టేడియంకు రాగా, వారిని అలరించేందుకు సంగీత విభావరి, నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు పలువురు సినీ నటులు విజయవాడ చేరుకున్నారు. సినీనటులు రామ్ చరణ్, శ్రీకాంత్, తరుణ్, నాని, శివాజీరాజా, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు విజయవాడ చేరుకున్నారు.