: మెదక్‌ను జిల్లా కేంద్రం చేయకపోతే పేరు మార్చుకుంటానంటున్న టీఆర్ఎస్ మహిళా నేత


రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఒప్పించి మెదక్‌ను జిల్లా కేంద్రం చేయకుంటే తన పేరు పద్మ కాదని డిప్యూటీ స్పీకర్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి సవాల్ చేశారు. మెదక్ ను జిల్లాగా మార్చలేకుంటే తన పేరును మార్చుకుంటానని ఆమె అన్నారు. జిల్లా హెడ్‌క్వార్టర్‌పై జరుగుతున్న దీక్ష శిబిరానికి తాను మంచి మనస్సుతో వెళ్తే, కొన్ని పార్టీల వారు అక్కడ తనను మాట్లాడకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని తెలిపారు. కొందరు నేతలు ప్రజలను తప్పు దారిలో నడిపించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారని ఆమె విమర్శించారు.

  • Loading...

More Telugu News