: టెస్టు సిరీస్ ను ఇండియా గెలవడం చాలా కష్టం: గవాస్కర్
ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరిగిన తొలి టెస్టులో 48 పరుగులతో ఇండియా ఓడిపోవడం బాధాకరమని ఆల్ టైమ్ గ్రేట్ గవాస్కర్ అన్నాడు. తన కెరీర్ బెస్ట్ 141 పరుగులతో కోహ్లీ, 99 పరుగులతో మురళీ విజయ్ అద్భుతంగా రాణించినప్పటికీ టీమిండియా ఓటమి పాలవడం బాధించే అంశమని చెప్పాడు. ఈ పరిస్థితుల నుంచి టీమిండియా బయటపడి, గెలుపు దిశగా సాగడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. సిరీస్ ను విజయవంతంగా ముగించడం ఇండియాకు కష్టసాధ్యమని చెప్పాడు. అద్భుతంగా ఆడారంటూ కోహ్లీ, మురళిలను అభినందించాడు.