: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా దినేశ్వర్ శర్మ నియామకం
దేశంలోని అత్యంత కీలక విభాగాల్లో ఒకటైన ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా దినేశ్వర్ శర్మ నియమితులయ్యారు. జనవరి 1న ఆయన నూతన చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. కేరళకు చెందిన దినేశ్వర్ శర్మ 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయనకు మరో రెండేళ్ల పదవీకాలం ఉంది.