: టీఆర్ఎస్ పై కొన్ని మీడియా సంస్థలు బురదజల్లుతున్నాయి: మంత్రి జగదీష్ రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వంపై కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని బురదజల్లుతున్నాయని టీఎస్ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. దీంతో, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిర్ణయాలు ప్రజలకు చేరకముందే, ప్రతికూల అంశాలు చేరుతున్నాయని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాచార వ్యవస్థ అత్యంత కీలకమని... దాన్ని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలే తమ ప్రచార సాధనాలు అని చెప్పారు.