: తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ గా కొప్పుల ఈశ్వర్
కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ గా ఎంపికయ్యారు. విప్ లుగా కామారెడ్డికి ఎమ్మెల్యే గంపా గోవర్ధన్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదేలును నియమించారు. పార్లమెంటరీ సెక్రటరీలుగా శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్ నగర్), జలగం వెంకట్రావు (కొత్తగూడెం)లు ఎంపికయ్యారు. వీరికి సహాయ మంత్రి హోదా కల్పించనున్నారు.