: భయపడే వంశీపై చేయిచేసుకున్నా: విష్ణు
కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య వివాదం ముదురుతోంది. ఇద్దరు కూడా పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. నిన్న ఈ ఇద్దరు యువ నేతలు పరస్పరం దాడులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. జరిగిన ఘటనపై విష్ణు మాట్లాడుతూ, "నా దర్గరకు వచ్చిన వంశీ చెవిలో దూషించాడు. అతని గన్ మెన్ నా తలకు తుపాకీ ఎక్కు పెట్టాడు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. భయంతోనే వంశీపై చేయి చేసుకున్నా" అని అన్నారు. వంశీతో మాట్లాడిన సీనియర్ నేత జానారెడ్డి తనతో మాత్రం మాట్లాడలేదని... ఆయన కాస్త హుందాగా వ్యవహరిస్తే బాగుండేదని అన్నారు.