: ఏపీ మెట్రో సాధ్యాసాధ్యాలపై చంద్రబాబు, శ్రీధరన్ సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో ఏపీ మెట్రో రైలు సలహాదారు శ్రీధరన్ కలిశారు. విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులపై చర్చించారు. ముఖ్యంగా విశాఖ, విజయవాడ మెట్రో సాధ్యాసాధ్యాలపై మార్చిలోగా నివేదిక ఇవ్వాలని బాబు కోరారు. జూన్ 2 నాటికి మెట్రో రైలు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. 2018కల్లా రెండు ప్రాంతాల్లో తొలిదశ మెట్రో పనులు పూర్తి చేయాలని శ్రీధరన్ కు సూచించారు.