: ఈ నెల 16న తెలంగాణ కేబినెట్ విస్తరణ


తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి కేబినెట్ విస్తరణ చేపడుతున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈ నెల 16న రాజ్ భవన్ లో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఇప్పటికే విస్తరణపై గవర్నర్ కు ప్రభుత్వం సమాచారం అందించింది. మొత్తం ఆరుగురికి కేబినెట్ లో చోటు దక్కుతుందని తెలుస్తోంది. ఇద్దరు మహిళలకు, ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి ఒక్కొక్కరికీ అవకాశం ఇస్తారని వినికిడి. మరోవైపు కొత్త మంత్రులకు ఛాంబర్ లు కేటాయించే విషయమై ఇప్పటికే సచివాలయం డి బ్లాక్ ను సీఎస్ రాజీవ్ శర్మ పరిశీలించారు.

  • Loading...

More Telugu News