: తెలంగాణలో 69 మంది రైతులే చనిపోయారనడం దారుణం: పొన్నాల
తెలంగాణ రాష్ట్రంలో 400 మంది రైతులు చనిపోతే 69 మంది రైతులే చనిపోయారని లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దారుణమని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. పూర్తిగా పరిశీలించకుండా ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్నే లోక్ సభలో చెప్పడం రైతులను అవమానించడమేనని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ దీనిని సమర్థిస్తోందా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పనితీరు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని విమర్శించారు. విష్ణు, వంశీచంద్ ల గొడవ వాళ్ల కుటుంబ వ్యవహారమని పొన్నాల చెప్పుకొచ్చారు.