: ఇంటర్నెట్ సౌకర్యానికి సహకారం అందించాలని కోరా: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను కోరినట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దానికి మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. హైదరాబాదు పర్యటనకు వచ్చిన రవిశంకర్ ప్రసాద్ చంద్రబాబుతో సమావేశమై రాష్ట్ర విశేషాలపై చర్చించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News