: వంశీ, విష్ణుల మధ్య జరిగింది చిన్న కొట్లాటే... మర్చిపోండి: వీహెచ్


కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య జరిగింది చిన్న కొట్లాట మాత్రమే అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ విషయంపై రాద్ధాంతం చేయరాదని సూచించారు. ఇద్దరూ గొడవను మర్చిపోయి, పార్టీ కోసం పనిచేయాలని అన్నారు. ఇదే సమయంలో బీజేపీపై వీహెచ్ మండిపడ్డారు. హిందుత్వ అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రజలను బీజేపీ రెచ్చగొడుతోందని ఆరోపించారు. ముస్లింలను హిందువులుగా మార్చాలనే కుట్రకు భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ తెరతీశాయని విమర్శించారు. బీజేపీకి అధికారం కట్టబెట్టింది భారత్ ను హిందూ దేశంగా మార్చడానికా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News