: వైభవంగా తెలుగు హీరో ఆది వివాహం
నటుడు సాయి కుమార్ కుమారుడు, తెలుగు యువహీరో ఆది వివాహం వైభవంగా జరిగింది. రాజమండ్రికి చెందిన అరుణ మెడలో మూడుముళ్లు వేశాడు. హైదరాబాదులోని సంధ్య కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ పెళ్లికి కుటుంబసభ్యులు, బంధువులు, సినీ పరిశ్రమ నుంచి అతికొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. ఈ సాయంత్రం గచ్చిబౌలిలో వివాహ రిసెప్షన్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులంతా హాజరయ్యే అవకాశం ఉంది.