: కుబేరుడి వద్ద వెంకన్న తీసుకున్న అప్పెంత?... సమాధానం కోసం ఆర్టీఐ కార్యకర్త పోరాటం


వడ్డీకాసులవాడిగా భక్తులు కొలుచుకునే వెంకన్న ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా ప్రసిద్ధిగాంచాడు. స్వామి వారిని దర్శించుకునే ప్రతి భక్తుడూ తమ శక్తి మేర తక్కువ మొత్తం నుంచి కోట్లాది రూపాయల వరకు ఆయనకు కానుకగా సమర్పిస్తుంటారు. తిరుమల శ్రీవారి వివాహం నిమిత్తం ఆయన అన్న గోవిందరాజులు స్వామి కుబేరుడి వద్ద అప్పు చేశాడని... ఆ అప్పుకు ఇంకా వడ్డీ కడుతూనే ఉన్నారనే విషయం భక్తులందరికీ తెలిసిన విషయమే. వారి అప్పు తీర్చేందుకు భక్తులందరూ తమ వంతుగా తమ తాహతుకు తగ్గట్టు స్వామి వారి హుండీలో ముడుపులు వేస్తుంటారు. అయితే, బెంగళూరుకు చెందిన సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త టి.నరసింహమూర్తి.... కుబేరుడి వద్ద స్వామివారు తీసుకున్న అప్పు ఎంతో తెలుసుకోవాలనుకున్నారు. ఇప్పటికే భక్తులందరూ భారీగా హుండీలో డబ్బులు వేశారు... ఇంకా ఎంత వేయాలి? ఎంత కాలం వేయాలి? అనే విషయంపై ఏకంగా సమాచార హక్కు చట్టం ద్వారా టీటీడీకి దరఖాస్తు చేసుకున్నారు. "ఫిబ్రవరి 6, 2012లో దరఖాస్తు చేసుకున్నాను. ఇంతవరకు టీటీడీ నుంచి సమాధానం రాలేదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను. సమాధానం వచ్చేంత వరకు పోరాడుతూనే ఉంటాను" అని నరసింహమూర్తి తెలిపారు.

  • Loading...

More Telugu News