: ఏపీలో రుణమాఫీపై ఎల్లుండి ఆర్థిక శాఖ జీవో
ఆంధ్రప్రదేశ్ లో రైతులకు రుణమాఫీ, పంటల బీమాపై ఎల్లుండి (సోమవారం) ఆర్థిక శాఖ జీవో జారీ చేయనుంది. వాటి పరిహారంపై స్పష్టతతో జీవో జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు అధికారులను ఆదేశించారు. విజయవాడలో గెస్ట్ హౌస్ లో ఉన్న సీఎంను రైతులు అంతకుముందు కలసి గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అనంతపురం, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల రైతులకు పరిహారంపై వివరణ ఇచ్చారు. 31.12.2013 తరువాత వచ్చిన పంటల బీమా పరిహారంపై వివరించారు. రూ.550 కోట్ల పరిహారం రైతుల ఖాతాల్లో నేరుగా జమవుతుందని చెప్పారు.