: జనవరి నుంచి స్మార్ట్ సిటీల నిర్మాణ కార్యక్రమం: వెంకయ్యనాయుడు
దేశంలో జనవరి నుంచి స్మార్ట్ సిటీ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. దేశంలో మొత్తం వంద స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని చెప్పిన ఆయన, స్మార్ట్ సిటీలలో అన్ని ఆధునిక సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. అంతేగాక మౌలిక వసతులకు పెద్దపీట వేస్తామని చెప్పారు. తిరుపతిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రకృతి, సంస్కృతి, భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే మన కార్యాచరణ ఉండాలని సూచించారు. జనాభా పెరుగుదలకు అనుగుణంగా రహదారుల విస్తరణ జరగడం లేదని పేర్కొన్నారు.