: కడప జిల్లా పేలుడులో బాలుడికి తీవ్ర గాయాలు
నిన్న హైదరాబాద్ లోని జవహర్ నగర్, నేడు కడప జిల్లా చాపాడు మండలం మడూరు గ్రామం... రెండు చోట్ల ఒకే రీతిన జరిగిన పేలుళ్లలో చిన్నారులు గాయపడ్డారు. శుక్రవారం జవహర్ నగర్ లో చోటుచేసుకున్న పేలుడులో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడగా, ఓ చిన్నారి తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. తాజాగా శనివారం కడప జిల్లా మడూరులో జరిగిన పేలుడులో 13 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ రెండు పేలుళ్లకు గల కారణాలు వెల్లడి కాలేదు. జవహర్ నగర్ ఘటన జరిగి 24 గంటలు దాటుతున్నా, ఆ పేలుడు కారణాలను వెలికితీయడంలో పోలీసులు విఫలమయ్యారు. తాజాగా మడూరు పేలుడు పరిస్థితి కూడా అంతే. పేలుడులో గాయపడ్డ బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.