: గొప్ప మనసు చాటుకున్న హిజ్రాలు!
స్త్రీ, పురుషుల కంటే హిజ్రాలే మనసున్నవారని చాటుకున్నారు. సికింద్రాబాద్-గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ కరీంనగర్ జిల్లా మీదుగా వెళుతున్న సమయంలో జనరల్ బోగీలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. దాంతో ఆమె విలవిల్లాడిపోతుంటే ఏ ఒక్కరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఇంతలో అటు వైపుగా భిక్షాటన చేసేందుకు వచ్చిన ఓ హిజ్రా ఆమె బాధను గమనించి తోటి హిజ్రాలకు సమాచారమందించాడు. దీంతో హిజ్రాలంతా కదిలారు. బోగీలో ఆమె సౌకర్యంగా ఉండేలా చోటు ఏర్పాటు చేశారు. తోటి ప్రయాణికులకు కనపడకుండా అడ్డం నిలబడి, ఆమెకు పురుడు పోశారు. బొడ్డు కోసి బిడ్డకు ప్రాణదానం చేశారు. దీంతో వారిని పలువురు అభినందించారు.