: అమెరికా స్కూల్లో మరోసారి కాల్పులు


అమెరికా స్కూళ్లలో తుపాకుల సంస్కృతి దినదిన ప్రవర్ధమానమవుతోంది. అమెరికా వ్యాప్తంగా ఎక్కడపడితే అక్కడ స్కూళ్లలో విద్యార్థులు కాల్పులకు దిగుతున్నారు. ఉత్తర పోర్ట్ ల్యాండ్ లోని రోజ్ మేరీ ఆండర్సన్ హైస్కూల్ ను ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతోంది. సమాజంలో మంచి విద్యను అభ్యసించే స్థోమత లేనివారి కోసం ఈ స్కూలును నడుపుతున్నారు. స్కూల్ ఆవరణలో కొందరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. కాల్పులు ప్రారంభం కావడంతో విద్యార్థులు స్కూల్ లోపలికి పరుగులు తీశారు. ఈ క్రమంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి గాయపడ్డారని, వారిని స్కూలు టీచర్లు ఆసుపత్రిలో చేర్చడంతో పెను ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఇది మాఫియా గ్యాంగుల పని అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News