: కేటీఆర్ దుబాయి పర్యటన రద్దు


తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు దుబాయి పర్యటన రద్దైంది. పెట్టుబడులను రాబట్టేందుకు నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయన దుబాయిలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ హైదరాబాద్ రానున్న నేపథ్యంలోనే కేటీఆర్ పర్యటన రద్దైంది. నేడు హైదరాబాద్ రానున్న రవిశంకర్ ప్రసాద్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఐటీ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ కూడా భేటీ కావాల్సి ఉంది. హైదరాబాద్ లో ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి రవిశంకర్ ప్రసాద్ తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు ప్రాధాన్యం దృఫ్ట్యా కేటీఆర్ తన దుబాయి పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News