: పెట్రోలు బంకుల్లో కూడా ఆధార్ కార్డు వివరాలివ్వాల్సిందే
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ బంకుల్లో వాహనాలు, వాహన చోదక అనుమతుల వివరాలు సేకరించి, ఆధార్ సంఖ్యతో అనుసంధానించే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి రోజు ఎంపిక చేసిన కొన్ని పెట్రోల్ బంకుల్లో ఈ సర్వేను ప్రారంభించాలని రవాణా శాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమం రెండు మూడు రోజుల్లో అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు విస్తరిస్తామని రవాణా శాఖ స్పష్టం చేసింది. పెట్రోల్ బంకుల వద్దకు ఇంధనం కోసం వచ్చే వాహనాలు, చోదకుల అనుమతి వివరాలు (డ్రైవింగ్ లైసెన్స్) సేకరించనున్నారు. వాహనదారుల నుంచి ఆధార్ కార్డు నకలు ప్రతి తీసుకుని, ఆధార్ సంఖ్యను రవాణా శాఖ సమాచార నిధిలో అనుసంధానం చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా సమాచారం అవసరమైతే సరి చూసుకునేందుకు సహాయపడుతుందని రవాణాశాఖాధికారులు అభిప్రాయపడుతున్నారు.