: 339 మంది నల్ల కుబేరులు 4,479 కోట్లు దాచారు


స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల నల్లధనానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం భారత్ కు అందజేసింది. హెచ్ఎస్ బీసీ అకౌంట్ల జాబితాపై విచారణ జరిపిన సిట్ ఆ వివరాలతో కూడిన రెండో నివేదికను కోర్టుకు సమర్పించింది. నల్లధనాన్ని అరికట్టేందుకు సంబంధించిన చట్టాలకు సవరణలు సహా 13 సూచనలు చేసింది. అలాగే స్విస్ బ్యాంకుల్లో 339 మంది భారతీయులు 4,479 కోట్ల రూపాయల నల్లధనం దాచారని వెల్లడించింది. అంతే కాకుండా, దేశీయంగా 14,958 కోట్ల రూపాయల నల్లధనం గుర్తించామని సిట్ పేర్కొంది. ఫ్రాన్స్ నుంచి అందిన జాబితాలో 628 మంది భారతీయుల అకౌంట్లలో 79 మంది అకౌంట్ హోల్డర్లపై ప్రాసిక్యూషన్ ప్రారంభమైందని సిట్ వివరించింది. ఇందులోని 289 అకౌంట్లలో డబ్బులేమీ లేవని, 201 మంది వివరాలు తెలియరాలేదని, మిగిలిన 427 మందిపై చర్యలు తీసుకోవచ్చని సిట్ స్పష్టం చేసింది. గుజరాత్, మహారాష్ట్రల్లో నగదు రవాణా చేస్తూ కొరియర్లుగా వ్యవహరిస్తున్న 'అంగడియాలు' బ్లాక్ మనీ చెలామణీలో కీలక పాత్ర పోషిస్తున్నారని సిట్ తెలిపింది. నగదు రవాణాపై పరిమితి విధించడం ద్వారా వీరిని కట్టడి చేయవచ్చని సిట్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News