: శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ, వైకాపాల మధ్య ఘర్షణ... రణరంగంగా గ్రామం


శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బురదపాడులో అధికార టీడీపీ, ప్రతిపక్ష వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాళ్లు, కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్న ఇరువర్గాలు గ్రామాన్ని రణరంగంగా మార్చాయి. పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఈ గొడవల్లో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించిన పోలీసులు గ్రామంలో పికెట్ ను ఏర్పాటు చేశారు. ఇరువర్గాల దాడుల నేపథ్యంలో ప్రస్తుతం గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News