: శ్రీకాకుళంలో విద్యుత్ తీగలు తగిలి ముగ్గురి మృత్యువాత


శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జి.సిగడం మండలం ఎస్పీఆర్ పురంలో విద్యుత్ షాక్ కు గురైన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. పొలంలోని పంటను పందుల నుంచి కాపాడుకునే క్రమంలో వేసిన విద్యుత్ కంచె ఆ ముగ్గురి ప్రాణాలను బలిగొంది. పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెను గుర్తించని ముగ్గురు వ్యక్తులు దానిని దాటుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

  • Loading...

More Telugu News