: రసకందాయంలో తొలి టెస్టు...లంచ్ విరామానికి టీమిండియా 105/2


భారత్-ఆస్ట్రేలియా సిరీస్ లో తొలి టెస్టు రసకందాయంలో పడింది. ఐదో రోజు తొలి సెషన్ లో 290/5 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ను ఆసీస్ డిక్లేర్ చేసింది. దీంతో టీమిండియా ముందు 364 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 16 పరుగులకే తొలి వికెట్ గా శిఖర్ థావన్ (9) ను కోల్పోయింది. నిలకడగా ఆడుతున్నాడని భావిస్తున్న సమయంలో రెండో వికెట్ గా పుజరా(21) వెనుదిరిగాడు. దీంతో 57 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా ఇబ్బందుల్లో పడింది. తరువాత మురళీ విజయ్ (47) కు కెప్టెన్ కోహ్లీ (25) జత కలిశాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. లంచ్ విరామ సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే ఇంకా 259 పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. జాన్సన్, లియాన్ చెరో వికెట్ తీశారు. మరో రెండు సెషన్ల ఆట మిగిలి ఉంది.

  • Loading...

More Telugu News