: ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది: బాబు
ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలే ప్రపంచం మొత్తం చూసేలా చేస్తున్నాయని అన్నారు. తూర్పు ఆసియా దేశాల పెట్టుబడులకు ఇంతకంటే మెరుగైన ప్రాంతం ఇంకోటి లేదని ఆయన తెలిపారు. విదేశీ కంపెనీలు పెద్దఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో స్థానికుల నైపుణ్యాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాలు రాజధానులుగా రూపుదిద్దుకుంటున్నందున దేశ, విదేశీ సంస్థలు పెట్టుబడులు పెడతాయని, దాని కారణంగా ప్రపంచ స్థాయి నగరాలుగా ఇవి రూపుదిద్దుకుంటాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయినందున అన్ని రకాల సమస్యలు చుట్టుముట్టాయని ఆయన అన్నారు. అయినప్పటికీ తాము పరిష్కారం దిశగా సాగుతున్నామని ఆయన చెప్పారు.