: హాకీ చాంపియన్స్ ట్రోఫీలో నేడు పాక్ తో భారత్ ఢీ!
హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు కీలక మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే నెదర్లాండ్స్, బెల్జియం జట్లను మట్టికరిపించి సెమీ ఫైనల్ చేరుకున్న భారత హాజీ జట్టు నేడు తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ తో సెమీ ఫైనల్ లో అమీతుమీ తేల్చుకోనుంది. క్వార్టర్ ఫైనల్ లో బెల్జియంను 4-2 స్కోరుతో ఓడించిన భారత జట్టు ఆటగాళ్లు మంచి ఊపుమీదున్నారు. నేటి రాత్రి 7.30 గంటలకు భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. దాయాదుల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ను తిలకించేందుకు హాకీ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లన్నీ శుక్రవారం కొద్ది గంటల్లోనే అమ్ముడైపోయాయి.