: నేడు దుబాయికి కేటీఆర్ పయనం
కొత్త రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రధాన లక్ష్యంతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు నేడు దుబాయి పయనమవుతున్నారు. మూడు రోజుల పాటు అక్కడ పర్యటించనున్న కేటీఆర్, అక్కడి ప్రభుత్వ పెద్దలతో పాటు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతోనూ భేటీ కానున్నారు. పెట్టుబడులతో తమ రాష్ట్రానికి వస్తున్న సంస్థలకు అందించే ప్రోత్సాహకాలతో పాటు, సింగిల్ విండో క్లియరెన్సులు, అనుమతుల విషయంలో అధికారుల జవాబుదారీతనం తదితరాలను ఆయన వారి ముందు పెట్టనున్నారు.