: ఏపీలో రుణమాఫీకి నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ నుంచి రుణమాఫీకి నిధులు విడుదలయ్యాయి. 32 నోడల్ బ్యాంకులకు రూ.4,586 కోట్లు మంజూరయ్యాయి. ఇంకా 11 నోడల్ బ్యాంకులు రుణమాఫీకి సంబంధించిన వివరాలు సమర్పించలేదు. బ్యాంకుల నుంచి వివరాలు అందిన వెంటనే మరో రూ.78 కోట్లు విడుదల చేస్తారు. కాగా, తొలి దఫా అర్హులకు ఈ నెల 16 లోగా రుణమాపీ మొత్తాలు వారి ఖాతాల్లో జమవనున్నాయి. అటు రుణమాఫీ పరిష్కారంపై ప్రభుత్వం జీవో 220 విడుదల చేసింది. ఫిర్యాదుల పరిష్కారానికి మండల, రెవెన్యూ డివిజన్, జిల్లా స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేయనుంది.