: పుటేజ్ లో వాస్తవాలివే... ఎమ్మెల్యేను పరుగెత్తించి కొట్టారు!
మాజీ ఎమ్మెల్యే విష్ణు, ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి మధ్య జరిగిన వివాదం పుటేజీ వెలుగు చూసింది. పుటేజీలో ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే విష్ణు అనుచరులు ఓ 20 మంది పరుగెత్తించి కొడుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అంత మంది ఎమ్మెల్యేపై దాడికి దిగడంతో ఆయన పరుగెత్తారు. అయినా వెంటపడి తరుముతూ కొట్టడంతో ఆయన గన్ మెన్ గన్ తీయడం కనిపించింది. దీంతో అసలు సీసీ కెమెరా పుటేజీలో వాస్తవాలు ఏంటనేది పోలీసులే వెలికి తీయాల్సి ఉంది.