: నా కొడుకును చంపాలన్న ఉద్దేశ్యంతోనే దాడి చేశాడు: పీజేఆర్ భార్య


నా కుమారుడు విష్ణును చంపాలన్న ఉద్దేశ్యంతోనే ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి దాడి చేశాడని దివంగత నేత పీజేఆర్ భార్య, విష్ణు తల్లి ఆరోపించారు. తన కుమారుడిపై కక్షకట్టారని, అందుకే ఊరికే ఉన్న తన కుమారుడిపై ఆయన దాడి చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భర్త లేకుండా ఎంతో విషాదంలో ఉన్నానని చెప్పిన ఆమె, తన కుమారుడిపై కక్ష కట్టవద్దని పేర్కొన్నారు. నా భర్త ఉన్నప్పుడు పనులు చేయాలంటూ తమ గేటు వద్ద పడిగాపులు కాసిన వ్యక్తి, తమపై తిరగబడ్డాడని ఆమె అన్నారు. తన కుమారుడికి అండగా నిలబడాలని ఆమె కోరారు.

  • Loading...

More Telugu News