: ఎట్టకేలకు కర్ణాటక అసెంబ్లీలో సెల్‌ఫోన్లపై నిషేధం
కర్ణాటక శాసనసభలో ఎంఎల్ఏలు సెల్ ఫోన్లో వీడియోలు, అసభ్య దృశ్యాలు చూసుకుంటూ కాలక్షేపం చేయడం ఇకపై కుదరదు. అసెంబ్లీకి మొబైల్ ఫోన్ లను తీసుకురావడాన్ని నిషేధిస్తున్నట్లు శాసనసభాపతి తిమ్మప్ప నేడు ఒక ప్రకటన జారీ చేశారు. ఈ నిషేధం తక్షణం అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. సెల్ ఫోన్లో ఫొటోలు చూస్తూ కెమెరాకు చిక్కిన ఎమ్మెల్యే ప్రభు చవాన్‌ను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే మంత్రి అంబరీష్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లికార్జున్‌లను మందలిస్తూ, ఇకపై అలా చేయరాదని హెచ్చరించారు.