: స్వాగతం పలకలేదని వాపోయిన పాకిస్థాన్ ఎంపీలు
పాకిస్థాన్ కు చెందిన కొందరు ఎంపీలకు భారత్ లో చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని పార్లమెంటును సందర్శించిన సందర్భంగా తమకు ఎవరూ స్వాగతం పలకలేదని, కనీసం లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా తమను పట్టించుకోలేదని వాపోయారు. ఓ ప్రైవేట్ గ్రూప్ నిర్వహించిన ఇరుదేశాల పార్లమెంటేరియన్ల సమావేశానికి తాము భారత్ వచ్చామని వారు వివరించారు. గురువారం నాడు కానీ, శుక్రవారం కానీ తమను పార్లమెంటులోకి అనుమతించలేదని, స్పీకర్ కూడా తమ గురించి ప్రస్తావించలేదనీ అన్నారు. ఆమెను కలిసేందుకు కనీసం అపాయింట్ మెంట్ కూడా దొరకలేదని అన్నారు. సమాచార లోపం వల్ల ఈ పరిస్థితి ఉత్పన్నమై ఉంటుందని మైజా అనే మహిళా సభ్యురాలు అభిప్రాయపడ్డారు.